Podharillu Serial: మహా, చక్రిల పెళ్ళి చేసిన ఎస్ఐ.. ప్రతాప్ ఎమోషనల్!
on Jan 16, 2026
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-29లో.. మహా, చక్రి, భూషణ్, ప్రతాప్, ఆది అందరు కలిసి పెళ్లి కోసం టెన్షన్ పడతారు. మహాతో వాళ్ళ నాన్న ప్రతాప్ మాట్లాడతాడు. ఇంకా నన్ను జీవచ్చవంలా మార్చొద్దని ప్రతాప్ అనగానే ఎమోషనల్ గా వెళ్ళి హగ్ చేసుకుంటుంది మహాలక్ష్మి. రా అమ్మ వెళ్దామని మహా అనగానే.. నాన్న .. రాలేను నాన్న అని మహా అంటుంది. ఈ పెళ్ళి ఆపేస్తానని పోలీస్ స్టేషన్ లో రాసివ్వు నాన్న వస్తానని మహా అనగానే రాయొద్దు అంకుల్.. నేను పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని భూషణ్ అంటాడు. నీకు అస్సలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని కానిస్టేబుల్ అనగానే భూషణ్ సైలెంట్ అంటాడు. వాళ్ళు పెళ్ళి ఆపరు సర్.. వాడికిచ్చే చేస్తారు కదా అని చక్రి అనగానే.. ప్రతాప్ కోపంగా వెళ్లి చక్రిని కొడతాడు. నీ పెళ్ళి ఘనంగా చేయాలని చూస్తున్నాడని ఆది తిడతాడు. ఎందుకు ఒక రాక్షసుడి చేతిలో పెడతారని మహా అంటుంది.
చక్రి, మహాల పెళ్ళి చేయడానికి పూలదండలు తెప్పిస్తాడు. ఇక చక్రి, మహాలకి పూలదండలు ఇచ్చి మార్చుకోమని ఎస్ఐ చెప్తాడు. ఇక ప్రతాప్ ముందే ఇద్దరు పూలదండలు మార్చుకుంటారు. ఆ తర్వాత ప్రతాప్ ఎమోషనల్ అవుతాడు. నాన్న అని మహా వెళ్ళి ఏడుస్తుంది. నీకు నాన్న లేడు.. బంగారు పల్లకి ఎక్కి పంపిద్దామనుకున్నా.. నువ్వేమో పాడెక్కి వెళ్ళిపోదామనుకున్నావని ప్రతాప్ ఎమోషనల్ అవుతాడు. ఎంతో ఘనంగా చేద్దామని అనుకున్నా నీ పెళ్ళి.. వాడు నీ ఆస్తి మీద కన్నేసి నిన్ను పెళ్ళి చేసుకున్నాడని రేపు అర్థం అయిన రోజున నా మాటలు నీకు అర్థమవుతాయని మహాతో ప్రతాప్ అంటాడు. ఆ తర్వాత మహా ఏడుస్తుంటుంది. ఇక ఆ తర్వాత భూషణ్ వస్తాడు. మహా మీదకి కోపంగా భూషణ్ వెళ్తుంటే అప్పుడే చక్రి అడ్డుపడతాడు. భూషణ్ కొట్టి.. మహా ఇప్పుడు నా భార్య.. తన మీద ఎవడైనా చేయి వేస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత మహా, చక్రిల పెళ్ళిని అఫీషియల్ గా రిజిస్టర్ చేయిస్తారు ఎస్ఐ. ఇక ఒక రిజిస్టర్ లో చక్రి సంతకం తీసుకుంటారు. ఆ తర్వాత మహా సంతకం చేయాలని చెప్పగా చక్రి వెళ్ళి మేనేజ్ చేసి మహాతో సంతకం చేపిస్తాడు. ఆ తర్వాత చక్రి , మహా ఇద్దరిని ఒక దగ్గర నిల్చోబెట్టి ఫోటో తీస్తారు. ఆ తర్వాత ఇద్దరిని సంతోషంగా ఉండమని చక్రి, మహాలతో ఎస్ఐ చెప్తాడు. కాసేపటికి మహా, చక్రి ఇద్దరు కారులో బయల్దేరి వెళ్తారు. మరోవైపు కన్నా మరియు చక్రి వాళ్ళ అన్న అందరు టెన్షన్ పడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



